ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మూడు రోజుల పాటు ఢిల్లీ, జైపూర్లలో పర్యటించనున్నారు. ఈ నెల 11, 12, 13 తేదీల్లో మూడు రోజుల పాటు సీఎం పర్యటన ఉంటుందని అధికారిక వర్గాలు తెలిపాయి. రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి ఈరోజు సాయంత్రం శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఢిల్లీకి వెళ్లనున్నారు. అక్కడి నుంచి జైపూర్ చేరుకుంటారు. బంధువు వివాహానికి హాజరై మళ్లీ సాయంత్రం తిరిగి ఢిల్లీ వెళ్లనున్నారు.
పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నందున కేంద్ర మంత్రులు ఢిల్లీలో అందుబాటులో ఉండనున్నారు. పలువురు మంత్రులను కలిసేందుకు అపాయింట్మెంట్లు తీసుకున్నట్లు తెలుస్తోంది. వివిధ పథకాల కింద రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ఆయా శాఖల నుంచి గ్రాంట్లు విడుదల చేయాలని కేంద్ర మంత్రులను కోరే అవకాశం ఉంది. మూడు రోజుల పర్యటనలో ఏఐసీసీ నేతలతో సీఎం రేవంత్ భేటీ అయ్యే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.