ఇన్నాళ్లు సహించాను ఇక ఊరుకునేది లేదు.. 

sai-pallavi-12.jpg

హీరోయిన్ సాయి పల్లవి ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నారు. తెలుగులో యువసామ్రాట్ అక్కినేని నాగచైతన్య సరసన తండేల్ చిత్రంలో నటిస్తున్నారు. డైరెక్టర్ చందూ మోండేటి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా త్వరలోనే అడియన్స్ ముందుకు రానుంది. అలాగే హిందీలో రామాయణ్ సినిమాలో నటిస్తుంది. ఇందులో సీతగా సాయి పల్లవి కనిపించనుండగా రాముడిగా రణబీర్ కపూర్ నటిస్తున్నారు. అలాగే ఇటీవలే అమరన్ సినిమాతో మరో హిట్ ఖాతాలో వేసుకుంది. అయితే హిందీలో రామాయణ సినిమాలో నటిస్తున్న సాయి పల్లవి గురించి సోషల్ మీడియాలో నిత్యం ఏదోక రూమర్ చక్కర్లు కొడుతుంది. ఈ మూవూ కోసం సాయి పల్లవి తన అలవాట్లు మార్చుకున్నారని కొన్ని వార్తలు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. తాజాగా ఈ రూమర్స్ పై ఘాటుగా స్పందించింది సాయి పల్లవి.

రామాయణ సినిమా కోసం సాయి పల్లవి ఎన్నో అలవాట్లు మార్చుకున్నారని కోలీవుడ్ లో ఓ మీడియా సంస్థ వార్తలు రాసింది. ఈ సినిమా పూర్తయ్యేవరకు సాయి పల్లవి నాన్ వెజ్ మానేసిందని హోటల్స్ లో కూడా తినడం లేదని విదేశాలకు వెళ్లేటప్పుడు కూడా తన వంటవాళ్లను వెంట తీసుకెళ్తుందని వార్తలు నెట్టంట వైరలయ్యాయి. తాజాగా వీటిపై స్పందిస్తూ ట్వీట్ చేసింది సాయి పల్లవి. నిరాధారమైన రూమర్స్ రాస్తే ఎంత పెద్ద సంస్థ అయినా లీగల్ యాక్షన్ ఎదుర్కొవాల్సి వస్తుందన్నారు.

Share this post

scroll to top