సీఎం చంద్రబాబు వ్యాఖ్యలపై అంబటి రాంబాబు కౌంటర్‌ ఎటాక్‌..

ambati-16-.jpg

పోలవరం ప్రాజెక్టు విషయంలో మరోసారి కూటమి సర్కార్‌ వైసీపీ మధ్య మాటల యుద్ధం ప్రారంభమైంది. పోలవరం ప్రాజెక్టును పరిశీలించిన సీఎం చంద్రబాబు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో గత ప్రభుత్వంపై ఆరోపణలు గుప్పించిన నేపథ్యంలో మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబు కౌంటర్‌ ఎటాక్‌కు దిగారు. పోలవరం పర్యటన తర్వాత చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ఆశ్చర్యం కలిగించాయి. నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు, అనేక అబద్దాలు చెబుతున్నారు. అసలు పోలవరాన్ని ప్రారంభించింది కట్టాలనుకున్నది దివంగత నేత వైయస్ రాజశేఖర్ రెడ్డి అని కానీ, పోలవరాన్ని తానే కడుతున్నట్లుగా చంద్రబాబు కథలు చెబుతున్నారు. కేంద్రం కట్టాల్సిన ప్రాజెక్టుని, బతిమిలాడి మేం కడతామని చెప్పి తీసుకున్నారు. ఇది చారిత్రాత్మక తప్పిదం అంటూ ఫైర్‌ అయ్యారు.

Share this post

scroll to top