భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నేడు ఏపీ లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పోలీసులు తూర్పు, పశ్చిమ గోదావరి, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల నుంచి దాదాపు 800 మంది పోలీసులతో పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు. మొత్తం 14 సెక్టార్లుగా విభజించి భద్రతను ఉన్నతాధికారులు పర్యవేక్షిస్తున్నారు. ఇవాళ ఉదయం 11.20కి రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము గన్నవరం విమానాశ్రయానికి చేరుకోనున్నారు. అక్కడి నుంచి నేరుగా మంగళగిరి ఎయిమ్స్ కు వెళ్లనున్నారు. స్నాతకోత్సవం సందర్భంగా విద్యార్థులకు రాష్ట్రపతి ముర్ము బంగారు పతకాలను ప్రదానం చేసి ప్రసంగించనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు తిరిగి గన్నవరం ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుని తిరిగి ఢిల్లీ కి వెళ్లనున్నారు.