బిల్లును ప్రవేశపెట్టిన మంత్రి అర్జున్‌ రామ్‌ మేఘ్వాల్‌..

jamili-17.jpg

నేడు లోక్‌సభ కార్యకలాపాలు కొనసాగుతున్న సమయంలో ” ఒకే దేశం, ఒకే ఎన్నికల బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టారు. న్యాయశాఖ మంత్రి అర్జున్‌రామ్ మేఘవాల్ బిల్లును సభలో ప్రవేశపెట్టారు. ప్రస్తుతం లోక్‌సభలో ‘ఒకే దేశం, ఒకే ఎన్నికల బిల్లు’పై చర్చ జరుగుతోంది. న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ లోక్ సభలో బిల్లును ప్రవేశపెట్టారు. 129వ రాజ్యాంగ సవరణ బిల్లును ప్రవేశపెట్టారు న్యాయశాఖ మంత్రి. లోక్‌సభలో జమిలి ఎన్నికల బిల్లు ప్రవేశపెట్టడాన్ని కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించింది. జమిలి బిల్లు గట్టెక్కాలంటే లోక్‌సభలో (542) అంటే 2/3 మెజారిటీ అవసరం. ఇకపోతే, ఎన్‌డీఏ బలం 293 కాగా ఇండియా బలం 234. జమిలి బిల్లు పాస్ కావాలంటే 361 మంది సభ్యుల మద్దతు అవసరం. ఈ జమిలి ఎన్నికల బిల్లు ప్రవేశపెట్టడాన్ని కాంగ్రెస్, ఎస్పీ, టీఎంసీ, డీఎంకే పార్టీలు బిల్లును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేసారు.

Share this post

scroll to top