ఏపీలో 3.20 లక్షల మంది దొంగ పింఛన్లు..

pinshion-20.jpg

పింఛన్లపై స్పీకర్ అయ్యన్న పాత్రుడు వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలో 3.20 లక్షల మంది దొంగ పింఛన్లు తీసుకుంటున్నారని బాంబ్‌ పేల్చారు స్పీకర్ అయ్యన్న పాత్రుడు. వీరికి ఐదేళ్లకు కలిపి రూ.7,200 కోట్లు ఖర్చవుతుందని తెలిపారు. తప్పుడు వయసుతో పెన్షన్లు తీసుకోవడం ఏంటి? ఇది దొంగతనం కాదా? అంటూ రెచ్చిపోయి మాట్లాడారు స్పీకర్ అయ్యన్న పాత్రుడు. ఇదే సొమ్ముతో మూడు తాండవ రిజర్వాయర్లు నిర్మించుకోవచ్చు అని వివరించారు. దొంగ పెన్షన్ తీసుకుంటున్న వారందరూ దొంగలే అని అంటాను అంటూ ఆగ్రహించారు. దొంగ పెన్షన్లపై సీఎం చంద్రబాబు నాయుడు కూడా చెప్పాను చూద్దాం అని అన్నారని తెలిపారు.

Share this post

scroll to top