సంధ్య థియేటర్ ఘటనలో అల్లు అర్జున్ను తప్పుపట్టాల్సిన అవసరం లేదన్నారు బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్. తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన సంధ్య థియేటర్ తొక్సిసలాట ఘటనపై స్పందించారు. “సౌత్ ఇండియన్ అడియన్స్ కు సినీతారలపై అభిమానం ఎక్కువే. ఒకసారి అజిత్ సినిమా కోసం అర్దరాత్రి షోకు వెళ్లాను. అక్కడ దాదాపు 25వేల మంది ఉన్నారు. అంతమందిని చూడడం అదే మొదటిసారి. సినిమా పూర్తయ్యాక తెల్లవారుజామున 4 గంటలకు బయటకు వచ్చే సమయానికి కూడా ఎంతోమంది అడియన్స్ బయట ఎదురుచూస్తున్నారు. అజిత్ మాత్రమే కాదు. చిరంజీవి, రజనీకాంత్, అల్లు అర్జున్ లాంటి హీరోల సినిమాలకు మొదటి రోజు ప్రేక్షకులు చాలామంది వస్తారు. ఆరోజు థియేటర్ దగ్గర కొన్ని వేల మంది ఉన్నారు. అంత మందిని చూడడం అదే మొదటిసారి. అనుకోకుండా జరిగిన ఘటనకు అల్లు అర్జున్ను మాత్రమే బాధ్యుడిని చేయడం సరికాదు. ఆ ఘటనలో అల్లు అర్జున్ను తప్పు పట్టాల్సిన అవసరం లేదు” అని అన్నారు.