నేడు నెల్లూరు జిల్లా నేతలతో వైయ‌స్ జగన్ భేటీ.. 

ys-jagn-08.jpg

వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి వరుసగా వివిధ జిల్లాల నేతలు, ప్రజాప్రతినిధులతో సమావేశం అవుతూ వస్తున్న విషయం విదితమే ఇప్పటికే పలు జిల్లాల నేతలు, ప్రజాప్రతినిధులతో సమావేశాలు నిర్వహించిన జగన్‌. తాజా రాజకీయ పరిస్థితులు, పార్టీ నిర్మాణంపై చర్చిస్తున్నారు. కష్టసమయంలోనే గట్టిగా నిలబడాలని ఇబ్బందులు వస్తే నన్ను గుర్తు చేసుకోవాలని చెబుతూ వస్తున్నారు. ఇక, ఇవాళ తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఉమ్మడి నెల్లూరు జిల్లాకు చెందిన నేతలతో వైసీపీ అధినేత జగన్ సమావేశం కానున్నారు. ఈ సమావేశానికి నెల్లూరు జిల్లాకు చెందిన వైసీపీ ఎంపీపీలు, జెడ్పీటీసీలు, మున్సిపల్ చైర్పర్సన్లు, మేయర్లు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, నాయకులు హాజరవుతారు. సమావేశంలో భాగంగా జిల్లాలో పార్టీని బలోపేతం చేయడానికి చేపట్టాల్సిన చర్యలపై వైసీపీ అధినేత జగన్ నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. ఈ భేటీలో తాజా రాజకీయ పరిణామాలు, జిల్లాలో నెలకొన్న సమస్యలు, తదితర అంశాలపై నెల్లూరు జిల్లా నేతలతో వైఎస్ జగన్ చర్చించే అవకాశం ఉంది.

Share this post

scroll to top