రాష్ట్రంలో సీఎంగా రేవంత్ రెడ్డి పాలన ఏడాది అయిపోయింది. ఏడాదిలో ఏమన్నా చేసిండా అంటే అయితే కోతలు, లేకపోతే ఎగవేతలు, కాదంటే కేసులు అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు మండిపడ్డారు. తెలంగాణలో భవన్లో బీఆర్ఎస్ పార్టీ డైరీ ఆవిష్కరణ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడారు. గతంలో డైరీ ఆవిష్కరణ కార్యక్రమాలు తెలంగాణ ఉద్యమ సభలుగా విలసిల్లినయి, ఉద్యమానికి గొప్ప ఊతమిచ్చాయి. ఈ డైరీ తిరగేస్తుంటే 14 ఏండ్ల ఉద్యమ ప్రస్థానం, మన పార్టీ సాధించిన విజయాలు కళ్లముందు కనిపిస్తున్నాయి. ప్రతి పార్టీ నాయకుడు, కార్యకర్తలు ఈ డైరీని తమ దగ్గర ఉంచుకోవాల్సిన అవసరం ఉంది. ఆనాటి డైరీ ఆవిష్కరణ సభలు రాష్ట్ర సాధనకు ఉపయోగపడితే, నేటి డైరీ ఆవిష్కరణ సభ బీఆర్ఎస్ హయాంలో జరిగిన అభివృద్ధిని తెలపడానికి, తిరిగి అధికారంలోకి తెచ్చుకోవడానికి ఉపయోగపడాలని హరీశ్‌రావు సూచించారు.