లేటెస్ట్ లుక్స్‌తో ఆకట్టుకుంటున్న హీరోయిన్..

pragya-09.jpg

వరుణ్ తేజ్ నటించిన కంచె సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ప్రగ్యా జైస్వాల్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన ఫస్ట్ మూవీతోనే మంచి గుర్తింపు సంపాదించుకున్నది. అలాగే తన అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకుల మన్ననలు పొందింది. దీంతో ఈ అమ్మడుకు వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. అలా వచ్చిన అవకాశాలన్నింటిలో నటిస్తూ హీరోయిన్‌గా రాణిస్తోంది. ప్రస్తుతం ఈ భామ బాలకృష్ణ సరసన ‘డాకు మహారాజ్ సినిమాలో నటిస్తోంది. బాబి కొల్లి దర్శకత్వం వహించిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12న గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

ఇక రిలీజ్ డేట్ దగ్గర పడటంతో ప్రమోషన్లో భాగంగా సోషల్ మీడియాలో తన అందాల జాతరతో అదరహో అనిపిస్తుంది. తాజాగా ప్రగ్యా తన ఇన్‌స్టా వేదికగా కొన్ని ఫొటోలు షేర్ చేసింది. అందులో మిక్స్‌డ్ కలర్ లెహంగాలో వయ్యారంగా చూస్తూ ఫొటోలకి పోజులిచ్చింది. అంతే కాకుండా ‘డాకు మహారాజ్ ప్రమోషన్స్ కోసం గుల్దస్తా వైబ్స్ అనే క్యాప్షన్‌ను జోడించింది. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట వైరల్‌గా మారాయి. ఇక వీటిని చూసిన నెటిజన్లు సూపర్, బ్యూటిఫుల్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Share this post

scroll to top