బీటౌన్‌ హీరోతో శ్రీలీల డేటింగ్‌..

bolliwood-09.jpg

శ్రీలీల తాజాగా ముంబైలో దర్శనమిచ్చింది. అక్కడ ఓ రెస్టారెంట్‌లో బాలీవుడ్‌ స్టార్‌ సైఫ్‌ అలీ ఖాన్‌ కుమారుడు ఇబ్రహీం అలీ ఖాన్‌ తో కలిసి కనిపించింది. వీరిద్దరూ రెస్టారెంట్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన అనంత‌రం మీడియాకి ఫోజులు ఇచ్చారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. ఈ ఫొటోలు చూసిన నెటిజన్లు వీరిద్దరూ కలుసుకోవడంపై సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. వీరు ఇప్పుడు ఎందుకు కలుసుకున్నారు. ఇద్దరూ డేటింగ్‌లో ఉన్నారా అంటూ చర్చించుకుంటున్నారు.

అయితే, మూవీ విషయమై ఆమె ముంబైకి వెళ్లినట్లు సినీ వర్గాలు పేర్కొంటున్నారు. అక్కడ అనుకోకుండా ఇబ్రహీంని కలుసుకుందని చెబుతున్నారు. అంతకు మించి వారిద్దరి మధ్యా ఎలాంటి రిలేషన్‌షిప్‌ లేదని అంటున్నారు. అదే సమయంలో ఇబ్రహీం ఖాన్‌ బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఇబ్రహీం సినిమాలో శ్రీలీలను నటిగా ఎంపిక చేసినట్లు సమాచారం. ఈ ప్రాజెక్ట్‌ గురించి చర్చల్లో భాగంగానే ఇద్దరూ కలిసినట్లు టాక్‌ వినిపిస్తోంది. మ‌రోవైపు శ్రీలీల ప్రస్తుతం నితిన్‌తో కలిసి రాబిన్‌ హుడ్‌, పవన్‌ కల్యాణ్‌ ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌ చిత్రాల్లో నటిస్తోంది. వీటితోపాటు RT75 ప్రాజెక్ట్‌లో ఫీ మేల్ లీడ్ రోల్‌లో నటిస్తోంది.

Share this post

scroll to top