ఏపీ డిప్యూటీ సీఎం చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. ఈ రోజు పిఠాపురంలో పర్యటనలో ఆయన మాట్లాడుతూ తాను 15 ఏళ్లు పొత్తులో ఉండాలనుకున్నానన్నారు. కానీ అధికారులు సహకరించట్లేదన్నారు. అధికారులు సహకరిస్తేనే ఇది సాధ్యమవుతుందన్నారు. అధికారులకు హనీమూన్ పీరియడ్ అయిపోయిందన్నారు. లా అండ్ ఆర్డర్ విషయంలో నాటకాలు వేస్తే తొక్కినారతీస్తానన్నారు. క్రిమినల్స్‌కు కులం ఉండదని స్పష్టం చేశారు. తనకు కష్టాలు తెలుసు కాబట్టే తగ్గి మాట్లాడుతానన్నారు. లా అండ్ విషయంలో నాటకాలు వేస్తే తొక్కినారతీస్తానన్నారు.
తిరుపతి ఘటనపై సైతం మరోసారి పవన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తొక్కిసలాట ఘటనపై తాను క్షమాపణ చెప్పానన్నారు. క్షమాపణ చెప్పేందుకు అధికారులకు ఎందుకు నామోషీ అని ఫైర్ అయ్యారు. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో శ్యామలా రావు, అడిషనల్ ఈవో వెంకయ్యచౌదరి, టీటీడీ బోర్డు సభ్యులు కూడా క్షమాపణ చెప్పాలన్నారు. తొక్కిసలాట ఘటనపై అందరూ క్షమాపణ చెప్పాల్సిందేనన్నారు. అధికారులు తప్పు చేయడంతో ప్రజలు సంబరాలు కూడా చేసుకోలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.