తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకైనా సంక్రాంతి పండుగను పురస్కరించుకొని నిర్వహించే కొండ చుట్టూ ఉత్సవాల్లో మాజీ మంత్రి ఆర్కే రోజా కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. తొలుత కొండ చుట్టూ మండపంలోని విఘ్నేశ్వరునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కొండ చుట్టుకు ప్రత్యేక అలంకరణతో విచ్చేసిన దేవతామూర్తులకు హారతులు ఇచ్చి దర్శించుకున్నారు. ఉత్సవ నిర్వాహకులు ఆలయ మర్యాదలతో ఆమెను స్వాగతించి ప్రసాదాలు అందజేశారు. ఆమె వెంట కుటుంబ సభ్యులు, బంధువులు, మున్సిపల్, మండల వైయస్ఆర్సీపీ శ్రేణులు పాల్గొన్నారు.