ట్రోలర్స్ పై థమన్ కామెంట్స్ పై స్పందించిన చిరంజీవి..

thaman-19.jpg

తాజాగా డాకు మహారాజ్ ఈవెంట్లో ట్రోలింగ్, ట్రోలర్స్ గురించి సంగీత దర్శకుడు థమన్ కామెంట్స్ చేశారు. అయితే తాజాగా ఆ కామెంట్స్ గురించి మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. నిన్న నువ్వు మాట్లాడిన మాటలు హృదయాల్ని తాకేలా ఉన్నాయి. ఎప్పుడూ సరదాగా మాట్లాడుతూ వుండే నీలో ఇంత ఆవేదన వుండడం నాకు ఒకింత ఆశ్చర్యంగా కూడా అనిపించింది. కానీ మనసు ఎంత కలత చెందితే నువ్వింతగా స్పందించావో అని అనిపించింది. విషయం సినిమా అయినా, క్రికెట్ అయినా, మరో సామజిక సమస్య అయినా సోషల్ మీడియా వాడుతున్న ప్రతి ఒక్కరు తమ మాటల తాలూకు ప్రభావం ఆ వ్యక్తుల మీద ఎలా వుంటుందని ఆలోచించాలి. ఎవరో అన్నట్టు మాటలు ఫ్రీ నే మనం పాజిటివ్ గా వుంటే ఆ ఎనర్జీ మన జీవితాలని కూడా అంతే పాజిటివ్ గా ముందుకు నడిపిస్తుంది. అంటూ మెగాస్టార్ చిరంజీవి స్పందించారు.

Share this post

scroll to top