ఏపీ కేబినెట్ నిర్ణయంపై సచివాలయ ఉద్యోగుల ఫైర్..

sachivalayam-20.jpg

ఉద్యోగంలో చేరిన తేదీ నుండి సర్వీసు లెక్కించి, నోషనల్‌ ఇంక్రిమెంట్లు ఇవ్వాలని, పెండింగ్‌లో ఉన్న డిఎలు ఇవ్వాలని సచివాలయాల ఉద్యోగులు డిమాండ్‌ చేస్తున్నారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో పని చేస్తున్న ప్రతి ఉద్యోగికి నిర్దిష్ట ప్రమోషన్‌ ఛానల్‌ వెంటనే ప్రకటించాలని కోరుతున్నారు. అలాగే పనిభారం తగ్గించాలని కోరుతున్నారు. ముఖ్యంగా వార్డు సచివాలయాల్లో పనిచేసే శానిటేషన్‌ సెక్రెటరీలకు మిగతా సచివాలయ ఉద్యోగులకు ఉండే సమయపాలన పాటించే విధంగా ఉత్తర్వులు ఇవ్వాలని కోరుతున్నారు. సచివాలయాల్లో ఎఎన్‌ఎం, హెల్త్‌ సెక్రెటరీలకు యాప్‌ల పని భారం తగ్గించాలని ఉద్యోగులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఒకేసారి అనేక రకాలైన సర్వేలు ఇచ్చి త్వరగా పూర్తి చేయాలని ఉద్యోగులను ఒత్తిడి చేయడం సరికాదని వారు చెప్తున్నారు.

Share this post

scroll to top