సుకుమార్‌ ఇంట్లో కొనసాగుతోన్న ఐటీ సోదాలు..

sukumar-22.jpg

హైదరాబాద్ కేంద్రంగా ఐటీ అధికారుల సోదాలు రెండో రోజు కూడా కొనసాగుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా, స్టార్ డైరెక్టర్ సుకుమార్ ఇంట్లో, ఆఫీసులో అధికారులు తనిఖీలు చేపడుతున్నారు. పుష్ప-2 మూవీ భారీ కలెక్షన్లు సాధించిన నేపథ్యంలో ఆ చిత్ర నిర్మాతలైన మైత్రీ మూవీ మేకర్స్ యాజమానుల ఇళ్లు, కార్యాలయాల్లో మంగళ‌వారం తెల్లవారుజాము నుంచి ఐటీ రెయిడ్స్ కొనసాగుతోన్న విషయం అందిరికీ తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ బ్యాంకు లావాదేవీలను క్షుణ్ణంగా పరిశీలించిన అధికారులు వసూళ్లకు తగినట్లుగా ఐటీ చెల్లింపులు జరగలేదని నిర్ధారించారు. ఈ నేపథ్యంలోనే తాజాగా, పుష్ప-2 మూవీ దర్శకుడు సుకుమార్ ఇంట్లో అధికారులు ఉదయం నుంచి సోదాలు చేస్తుండటం చర్చనీయాశంగా మారింది.

Share this post

scroll to top