పెళ్లి చేసుకొని అక్కడే సెటిల్ అవుతా..

janvi-23-.jpg

బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ప్రస్తుతం తెలుగులో సినిమాలు చేస్తూ బిజీగా మారుతుంది. ఇటీవలే దేవర సినిమాతో భారీ విజయాన్ని అందుకుంది. ఎన్టీఆర్ హీరోగా నటించిన దేవర సినిమాకు కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది ఈ చిన్నది. అలాగే ఇప్పుడు రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న సినిమాలోనూ జాన్వీ కపూర్ హీరోయిన్ గా చేస్తుంది. బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ త్వరలోనే మొదలవ్వనుంది. అటు బాలీవుడ్ లో ఇటు టాలీవుడ్ లో సినిమాలు చేస్తూ బిజీగా ఉంది జాన్వీ. తాజాగా జాన్వీ చేసిన కామెంట్స్ ఇప్పుడు ఇండస్ట్రీలో తెగ వైరల్ అవుతున్నాయి. పెళ్లి చేసుకోని సెటిల్ అవ్వాలనుకుంటున్నట్టు తెలిపింది జాన్వీ.

తాజాగా కరణ్ జోహార్ షోలో జాన్వీ మాట్లాడుతూ ‘పెళ్లి చేసుకుని తిరుమలలో భర్తతో సెటిల్ అవ్వాలి. ముగ్గురు పిల్లతో హాయిగా గడపాలి, ప్రతిరోజూ అరటి ఆకులో అన్నం తినాలి, గోవిందా గోవిందా అని స్మరించుకోవాలి. అలాగే మణిరత్నం సినిమాల సంగీతం వింటూ కూర్చోవాలి’ అని జాన్వీ కపూర్ తెలిపింది. అయితే ఇందులో రొమాంటిక్ ఇష్యూ ఏంటనేది పక్కనే కూర్చున్న కరణ్ జోహార్ కు తెలియలేదు. 2018లో విడుదలైన ‘ధకడ్’ సినిమాతో జాన్వీ ఎంట్రీ ఇచ్చింది.ఇప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉంది.

Share this post

scroll to top