మంత్రి నారా లోకేష్‌ను ప్రమోట్ చేయడానికే చంద్రబాబు దావోస్ వెళ్లారని ఎన్టీఆర్ జిల్లా వైయస్ఆర్‌సీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్ విమర్శించారు. లోకేష్‌ను డిప్యూటీ సీఎం చేయాలన్న ఆకాంక్షతో ప్రచారం చేస్తున్నారు. ప్రజాధనంతో దావోస్‌లో ఎంజాయ్ చేస్తాం అంటే చూస్తూ ఊరుకోము అంటూ ఆయన హెచ్చరించారు. విజయవాడ తూర్పు నియోజకవర్గ వైయస్ఆర్‌సీపీలో 29 అనుబంధ సంఘాలకు అధ్యక్షులు నియామకం జరిగింది.
అధ్యక్షులుగా నియమితులైన వారిని ఎన్టీఆర్ జిల్లా పార్టీ అధ్యక్షులు దేవినేని అవినాష్ అభినందించారు. ఈ క్రమంలో చంద్రబాబు , లోకేష్ దావోస్ పర్యటనపై దేవినేని అవినాష్ స్పందించారు. చంద్రబాబు ఆయన కొడుకు 100 కోట్ల ప్రజాధనంతో దావోస్ పర్యటనకు వెళ్లారు. రూపాయి పెట్టుబడి తీసుకురాలేని దావోస్ పర్యటన వల్ల ఈ రాష్ట్రానికి ఒరిగిందేమిటి? నారా లోకేష్‌ను ప్రమోట్ చేయడానికే చంద్రబాబు దావోస్ వెళ్లాడు. లోకేష్‌ను డిప్యూటీ సీఎం చేయాలన్న ఆకాంక్షతో ప్రచారం చేస్తున్నారు.