దావోస్‌లో రాష్ట్రానికి పెట్టుబడుల అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ రెడ్డి సచివాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రంలో రూ.1.80 వేల కోట్లు పెట్టడానికి పలు కంపెనీలు ముందుకు వచ్చినందుకు ఆయా కంపెనీలకు ధన్యవాదములు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం విదేశీ పెట్టుబడుల కోసం అంతర్జాతీయ సంస్థలను ఆకర్షించడం కోసం దావోస్ వెళ్ళామని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 14 నెలలలో ఇదే అతి పెద్ద విజయం అని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. తెలంగాణ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయాలని కొందరు కుట్రలు పన్నుతున్నారని సీఎం ఆరోపించారు.
ప్రపంచ దిగ్గజ కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. 2004-2014 వరకు అప్పుడు తీసుకున్న నిర్ణయాల మేరకు పెట్టుబడులు వచ్చాయన్నారు. నాడు ప్రధాని పీవీ సరళీకృత ఆర్థిక విధానాలు తీసుకు వచ్చారు. ప్రపంచానికి ఒక బలమైన విశ్వాసాన్ని కాంగ్రెస్ నాయకత్వం చూపిందని తెలిపారు. రాజకీయ పరమైన విధానాలను విభేదించినా రాష్ట్ర ప్రయోజనాల కోసం ఉపేక్షించామని పేర్కొన్నారు. గత ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు ప్రయోజనం చేకూర్చే నిర్ణయాలు తీసుకుంటే మరింత స్పష్టతతో ముందుకు వెళ్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. పెట్టుబడి దారులకు వేగంగా భూములు అనుమతులు ఇస్తున్నాం ఉద్యోగావకాశాలు పెంచాలని తమ ఆకాంక్ష అని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.