మీడియాపై కూటమి పార్టీ ఎమ్మెల్యే వివాదస్పద వ్యాఖ్యలు..

jayam-ram-29-1.jpg

కూటమి పార్టీ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. నా వార్తలు రాస్తే రైలు పట్టాలపై పడుకోబెట్టి చంపేస్తా అంటూ స్ట్రాంగ్‌ వార్నింగ్‌ ఇచ్చారు గుమ్మనూరు జయరాం. మీడియా అంటే నాకు లెక్కలేదన్నారు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం. తాజాగా మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. తనపై లేనిపోనివి రాస్తే రైలు పట్టాలపై పడుకోబెట్టి చంపడానికైనా సిద్ధం అంటూ బాంబ్‌ పేల్చారు. నేను అన్నీ చేసి వచ్చిన వాడిని రాసుకోండి. ఏం రాసుకుంటారో అంటూ తేల్చి చెప్పారు. తప్పు చేస్తే రాయండి ఆధారాలు లేకుండా రాస్తే తాట తీస్తానని హెచ్చరించారు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం. తప్పులు ఉంటే వాటన్నింటినీ నిరూపించాలి లేదంటే రైలు పట్టాలపై పడుకోబెడతారని హెచ్చరించారు.  దీంతో మీడియాపై కూటమి పార్టీ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం చేసిన వివాదస్పద వ్యాఖ్యలు వైరల్‌ గా మారాయి. మరి దీనిపై కూటమి అధిష్టానం ఎలా రియాక్ట్‌ అవుతుందో చూడాలి.

Share this post

scroll to top