తెలంగాణ ఉద్యమంలో గద్దర్ ఉన్నారా బండి సంజయ్ ఉన్నాడా? అని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రశ్నించారు. ఊరూరా తిరిగి పాట పాడి చైతన్యం చేసిన వ్యక్తి గద్దర్. ఆయన చనిపోతే ప్రధాని మంత్రి నరేంద్ర మోడీ కూడా నివాళి అర్పించారు అని గుర్తు చేశారు. కేంద్ర మంత్రిగా ఉన్న సంజయ్ ఈలాంటి కామెంట్స్ చేసి ఉండకుంటే బాగుండేది అన్నారు. ఇక, తాము మూసీ నదిని క్లీన్ చేస్తామంటే కిషన్ రెడ్డి, బండి సంజయ్ లు ఏసీ రూమ్స్ లో పడుకుంటున్నారు. ఈ బీజేపీ వాళ్లు యూపీలో గంగా ప్రక్షాళన చేస్తామంటే సంతోష పడతారు. కానీ, మూసీ ప్రక్షాళన చేస్తామంటే మాత్రం అడ్డు తగులుతున్నారని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆరోపించారు.
ఇక, నల్గొండాకు కేటీఆర్ ఎందుకు వచ్చారు. పదేళ్లు మా జిల్లాను విస్మరించారని మంత్రి కోమటిరెడ్డి అన్నారు. మానవత్వం లేని మృగాలు వాళ్ళు SLBC ఎందుకు కంప్లీట్ చేయలేదు. మల్లన్న సాగర్ నుంచి ఆలేరుకి ఎందుకు నీళ్ళు ఇవ్వలేదో సమాధానం చెప్పు అని ప్రశ్నించారు. అలాగే, మహాత్మా గాంధీ యూనివర్సిటీకి పదేళ్లలో ఎప్పుడైనా కేటీఆర్ వెళ్ళాడా అని అడిగారు. టీ- హబ్ కి తాళం వేసి ఉంచారు. కంపెనీలు ఎందుకు తీసుకురాలేదు. బార్లా లాగా టీ- హబ్ ను తయారు చేశారని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ మీటింగులకు పల్లి బటాని బుక్కోవడానికి వచ్చినంత మంది కూడా కేటీఆర్ సభకు రాలేదన్నారు. ఫ్లోరోసిస్ కోసం నేను పోరాటం చేసినప్పుడు కేసీఆర్. డిప్యూటీ స్పీకర్ గా ఉన్నాడనికోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు.