2013 లో వెండితెర అరంగ్రేటం చేసిన మాళవిక మోహన్ తర్వాతి కాలంలో వరుస సినిమాలో అవకాశాలు ఛాన్స్ లు పట్టేస్తూ స్టార్ హీరోలతో జోడి కట్టింది. నిత్యం సోషల్ మీడియా లో హాట్ హాట్ ఫొటోస్ తో తన ఫ్యాన్స్ కు ఆనందపరుస్తూ అలరిస్తోంది మాళవిక ఇప్పటి వరకు స్ట్రయిట్ తెలుగు సినిమా చేయని మాలవిక మోహన్ తొలిసారి రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న రాజాసాబ్ సినిమాతో తెలుగు తెరకు ఎంట్రీ ఇస్తుంది. పరువం వానగా నేడు కురిసెనులే ముద్దు మురుపాలుగా నేడు మురిసెనులే అంటూ మాళవిక లేటెస్ట్ గా షేర్ చేసిన ఫొటోస్ ను చూస్తూ ఫ్యాన్స్ సోషల్ మీడియా లో కామెంట్స్ చేస్తున్నారు. అందానికే అసూయపడేలా ఉన్న మాళవిక నిను ఇలా చూస్తుంటే నాకు నిదురే రాధికా అని ఓ నెటిజన్ కామెంట్ చేసాడు. రాజాసాబ్ తో గ్రాండ్ ఎంట్రీతో పాటు సూపర్ హిట్ కొట్టి టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఎదగాలని మాళవిక ఫ్యాన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.