మెగాస్టార్ చిరంజీవి మాతృమూర్తి అంజనా దేవి పుట్టినరోజు సందర్భంగా ఆమెకి శుభాకాంక్షలు చెబుతూ చిరంజీవి ఓ స్పెషల్ వీడియోని షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియోల్ వైరల్ గా మారింది. అంజనమ్మ పుట్టిన రోజు వేడుకలు సెలెబ్రేషన్స్ ను ఉపాసన డెకరేట్ చేసారు. అంజనమ్మ బయటికి రాగానే చిరు ఇంట్లోని వారందరు పూలు జల్లి స్వాగతం పలికారు. మరోవైపు హ్యాపీ బర్త్‌డే నానమ్మ అంటూ పాట పడుతూ రామ్ చరణ్ తన నానమ్మకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.
ఇక చిరంజీవి కూడా హ్యాపీ బర్త్‌డే అమ్మ అమ్మమ్మ అని పాట పడుతూ విషెష్ తెలిపారు. అమ్మమ్మ ఏంట్రా అంటూ అంజనమ్మ చిరును ప్రశ్నించగా అదే అమ్మ మా అంజనమ్మ అంటూ నవ్వుతూ సమాధానం ఇచ్చారు చిరు. అనంతరం తన అమ్మ అంజనమ్మతో కేక్ కట్ చేయించి బర్త్‌డే సెలెబ్రేషన్స్ ను గ్రాండ్ గా నిర్వహించారు. ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అమ్మా ఈ ప్రత్యేకమైన రోజు నీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాం. నీ గొప్పతనం గురించి చెప్పడానికి నాకు మాటలు సరిపోవు అమ్మ నిన్ను మేము ఎంత ప్రేమిస్తున్నామో మాటల్లో చెప్పలేం.. నువ్వంటే మాకు ఎంతో గౌరవం అమ్మ. పుట్టిన రోజు శుభాకాంక్షలు అమ్మ మన కుటుంబానికి నువ్వొక స్వీట్ హార్ట్. మా బలం నువ్వు స్వచ్ఛమైన ప్రేమ నువ్వు ఇట్లు నీ పాదాలకి నమస్కరిస్తూ పుణ్యం చేసుకొన్న నీ సంతతి అంటూ చిరంజీవి పోస్ట్ చేశారు