మెరిసే చర్మం కోసం ఇలా చేయండి..

glow-31-.jpg

ఈ రోజుల్లో బిజీ లైఫ్‌స్టైల్, ఒత్తిడి, కాలుష్యం, చెడు అలవాట్ల కారణంగా ముఖంపై చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. నల్లటి మొటిమలు, జుట్టు రాలటం, ముఖంపై ముడతలు ఇవి సర్వసాధారణంగా వస్తున్న సమస్యలు. అయితే మీ ఆహారంలో కొన్ని చక్కటి ఆహార పదార్థాలు జోడించడం వల్ల ఈ సమస్యలు తగ్గించవచ్చు. కొన్ని ఆహార పదార్థాలు తింటే సరిపోతుంది.

డ్రై ఫ్రూట్స్

బాదం, పిస్తా, వాల్‌నట్స్, జీడిపప్పు వంటి నట్స్‌లో చర్మానికి అవసరమైన యాంటీ ఏజింగ్‌ సమ్మేళనాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మాన్ని యవ్వనంగా ఉంచడమే కాకుండా దానిలోని విటమిన్లు, ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు చర్మాన్ని ముదిరి పోకుండా కాపాడతాయి. 

గ్రీన్ టీ

గ్రీన్ టీ కూడా ఈ లిస్టులో ఒక భాగం. ఇందులోని శక్తిమంతమైన యాంటీఆక్సిడెంట్లు శరీరాన్ని టాక్సిన్స్ నుండి రక్షిస్తాయి. గ్రీన్ టీలోని ఫ్లేవనాయిడ్స్ చర్మంపై ముడతలు, గీతలు, ఇతర వృద్ధాప్య లక్షణాలను తగ్గించడానికి సహాయపడతాయి. 

చేపలు

సాల్మన్, మారికేలా వంటి కొవ్వు చేపలు చర్మాన్ని మెరుస్తూ, ముఖంపై రంధ్రాలు, ముడతలు తగ్గించే సహాయాన్ని అందిస్తాయి. ఈ చేపలలో ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు, విటమిన్-బి12, బి6, విటమిన్ డి పుష్కలంగా ఉండటం వల్ల మీ చర్మం కాంతివంతంగా మారుతుంది.

ఆకుకూరలు

తోటకూర, పాలకూర, మెంతి వంటి ఆకుకూరలు ఆరోగ్యానికి మాత్రమే కాకుండా చర్మాన్ని మెరిపించే పోషకాలు అందిస్తాయి. వీటిలో ఉన్న విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు చర్మాన్ని యవ్వనంగా ఉంచుతూ ముడతలు తగ్గించడంలో సహాయపడతాయి.

Share this post

scroll to top