ఇన్ని రోజులుగా నేను మోనంగా, గంబిరంగా చూస్తున్న నేను కొడితే మాములుగా ఉండదు అని కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జహీరాబాద్ బీఆర్ఎస్ నేతల సమావేశంలో కేసీఆర్ మాట్లాడారు. తెలంగాణ శక్తి ఏందో కాంగ్రెస్ వాళ్ళకి చూపించి మెడలు వంచుతాం. కాంగ్రెస్ ఏడాది పాలనలో ప్రజలు సంతోషంగా లేరు. కాంగ్రెస్ వాళ్లు దొరికితే ప్రజలు కొట్టేటట్టు ఉన్నారు. నిన్న కాంగ్రెస్ వాళ్లు పోలింగ్ పెడితే మనకే ఎక్కువ ఓటింగ్ వచ్చింది. నేను చెప్పిన ప్రజలు వినలేదు. అత్యాశకు పోయి కాంగ్రెస్ కి ఓటేశారు. రైతు బంధుకి రాం రాం, దళితబంధుకి జై భీం చెబుతారని ఆనాడే చెప్పాను. తులం బంగారానికి ఆశపడి కాంగ్రెస్ కి ఓటేశారు. రాబోయే రోజుల్లో విజయం మనదే. మన విజయం తెలంగాణ ప్రజల విజయం కావాలి. ప్రత్యక్ష పోరాటాలకు సిద్ధం కండి. భూముల ధరలు అమాంతం పడిపోయాయి. చారిత్రక సందర్భంలో తెలంగాణ జాతి ఇతరుల చేతుల్లో చిక్కి విలవిలలాడింది, సర్వనాశనం అయిందని తెలిపారు.
ఇన్ని రోజులుగా నేను మోనంగా, గంబిరంగా చూస్తున్న..
![kcr-31-.jpg](https://manaaksharam.com/wp-content/uploads/2025/01/kcr-31-.jpg)