లివర్ ఆరోగ్యాన్ని కాపాడే సూపర్ ఫుడ్స్..

liver-03.jpg

మన ఈ జీవన విధానంలో సరైన ఫుడ్ డైట్ పాటించకపోవడం వల్ల చాలా ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తోంది. అధికంగా ప్రాసెస్ చేయబడిన ఆహారాలు, ఆల్కహాల్, సిగరెట్ ధూమపానం జీవక్రియను బాగా దెబ్బతీస్తాయి. ఇవన్నీ లివర్ పనితీరును ప్రభావితం చేస్తాయి. లివర్ ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి కొన్ని రకాల ఆహారాలు తినాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. వీటిని మీ రోజువారీ ఆహారంలో చేర్చుకుని తినటం వల్ల మీరు లివర్ ని ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.

అవకాడో

అవకాడోలో ఆరోగ్యకరమైన కొవ్వులు పుష్కలంగా ఉంటాయి. వీటిలో గ్లూటాథియోన్స్ అనే బలమైన యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి శరీరం నుండి విషాన్ని సమర్థవంతంగా తొలగిస్తాయి. దీనిలోని ఆరోగ్యకరమైన మోనోశాచురేటెడ్ కొవ్వులు లివర్ ఆరోగ్యానికి కూడా తోడ్పడతాయి.

గ్రీన్ టీ

గ్రీన్ టీలో లివర్ పనితీరును మెరుగుపరిచే కాటెచిన్స్ అనే సమ్మేళనాలు పుష్కలంగా ఉంటాయి. అవి జీవక్రియను కూడా వేగవంతం చేస్తాయి. ఇది ఉబ్బరం సమస్యలను నివారిస్తుంది. అదే సమయంలో పొట్ట చుట్టూ ఉన్న కొవ్వు కరుగుతుంది. 

ద్రాక్ష

లివర్ లో విషపూరిత వ్యర్థాలు పేరుకుపోకుండా నిరోధించడంలో ఎంజైమ్‌లు, యాంటీఆక్సిడెంట్లు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. ద్రాక్షలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది ఎంజైమ్‌ల పనితీరును మెరుగుపరుస్తుంది. వీటితో పాటు నరింగెనిన్ అనే సమ్మేళనం శరీరంలో కొవ్వు పేరుకుపోకుండా ఆపుతుంది.

వాల్‌నట్స్

వాల్‌నట్స్‌లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు, అమైనో యాసిడ్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి లివర్ నుండి విషాన్ని తొలగించి కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడతాయి. వీటిని తినడం వల్ల కడుపు నిండిపోతుంది దాంతో చిరుతిళ్లు తినకుండా ఉండే అవకాశం ఉంటుంది.

పసుపు

పసుపులో కర్కుమిన్ అనే సమ్మేళనం పుష్కలంగా ఉంటుంది. ఇది లివర్ లో వాపును తగ్గిస్తుంది. దీనితో పాటు ఇది కొవ్వును సమర్థవంతంగా కరిగించడంలో సహాయపడుతుంది.

ఆకు కూరలు

లివర్ ని ఆరోగ్యంగా ఉంచడానికి పాలకూర కాలే వంటి ఆకుపచ్చ కూరగాయలను రెగ్యులర్ డైట్‌లో చేర్చాల్సి ఉంటుంది. ఈ ఆకు కూరలలో క్లోరోఫిల్ పుష్కలంగా ఉంటుంది. ఇది లివర్ లోని విషాన్ని నిలువరిస్తుంది.

బీట్‌రూట్

బీట్‌రూట్ లివర్ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. లివర్ లో పేరుకుపోయిన కొవ్వులు, విష వ్యర్థాలను బయటకు పంపుతాయి. ఇది నైట్రిక్ ఆక్సైడ్ విడుదలను ప్రేరేపిస్తుంది. అంతేకాక ఇది రక్త ప్రసరణతో పాటు జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.

Share this post

scroll to top