రోడ్డుపై బాయ్‌ఫ్రెండ్ విషయంలో గొడవపడ్డ స్కూల్ విద్యార్థినులు..

boy-friend-04.jpg

బీహార్ రాష్ట్రంలోని పూర్నియా జిల్లాలో ఓ ఆసక్తికరమైన ఘటన చోటుచేసుకుంది. ఓ అబ్బాయిపై ప్రేమ పెంచుకున్న ఇద్దరు స్కూల్ విద్యార్థినులు తన బాయ్ ఫ్రెండ్ కోసం బహిరంగంగా గొడవకు దిగారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పూర్నియాలోని గులాబ్‌బాగ్ హాన్స్‌దా రోడ్ సమీపంలోని ఒక ప్రభుత్వ పాఠశాల వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. సమాచారం ప్రకారం, ఒకే అబ్బాయితో రెండు విద్యార్థినులు ప్రేమలో ఉన్నారు. ఈ విషయం ఒకరికి తెలియడంతో ఇద్దరూ ముందుగా వాగ్వాదానికి దిగారు.

గొడవ జరగక ముందు ఇద్దరూ తమ సహచరులను తీసుకుని రోడ్డుపై వచ్చారు. తొలుత మాటల యుద్ధంగా మొదలైన ఈ గొడవ, కొంతసేపటికి హింసాత్మకంగా మారింది. స్కూల్ యూనిఫామ్‌లోనే ఉన్న విద్యార్థినులు ఒకరిపై ఒకరు దాడి చేసి కొట్టుకోవడం, జుట్టును పట్టుకొని లాగడం మొదలుపెట్టారు. ఈ గొడవ బహిరంగంగా రోడ్డుపై బహిరంగంగా జరగడంతో అక్కడి వారి ఆశ్చర్యపోయారు. చాలామంది విద్యార్థినులు ఈ ఘర్షణలో పాల్గొన్నారు. ఇది చూసిన స్థానికులు వెంటనే జోక్యం చేసుకుని విద్యార్థినులను శాంతింపజేశారు. దీంతో గొడవ అదుపులోకి వచ్చింది. అయితే, ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఈ ఘటనపై మరింత చర్చ మొదలైంది.

Share this post

scroll to top