భారత్‌కు తగిలిన ట్రంప్ సెగ..

amirikca-04.jpg

అమెరికాలో అధికారం చేపట్టిన తర్వాత, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అక్రమ వలసదారులను దేశం నుండి బహిష్కరించడానికి కఠినమైన చర్యలు తీసుకుంటున్నారు. నిన్న మొన్నటి వరకు కెనడా, మెక్సికో, కొలంబియా, బ్రెజిల్ దేశాలకు చెందిన వారిని గెంటేసిన ట్రంప్ తాజాగా భారత్‌ వంతు వచ్చేసింది. అమెరికాలో నివసిస్తున్న అక్రమ భారతీయ వలసదారులను స్వదేశానికి తిప్పి పంపిస్తున్నారు. అమెరికా మిలటరీకి చెందిన సి -17 ప్రత్యేక విమానం బయలుదేరింది. అమెరికన్ అధికారి ఒకరు ఈ సమాచారం ఇచ్చారు. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన ఇమ్మిగ్రేషన్ ఎజెండాను నెరవేర్చడానికి సైన్యం సహాయం తీసుకుంటున్నారు. దీని కింద సైనిక విమానాల సహాయంతో ప్రజలను బహిష్కరించే పని ప్రారంభించారు.

Share this post

scroll to top