నందిగామ మున్సిపల్ చైర్మన్ ఎన్నికలో మరో ట్విస్ట్..

sowmya-04.jpg

ఎన్టీఆర్ జిల్లా నందిగామ మున్సిపల్ చైర్మన్ ఎన్నికలో మరో ట్విస్ట్ వచ్చి చేరింది.. ఎమ్మెల్యేగా తాను సూచించిన కౌన్సిలర్ సత్యవతి పేరు పై బీఫామ్ వస్తుందని ఆశించారు తంగిరాల సౌమ్య అయితే, ఎమ్మెల్యే సౌమ్యకు మరోసారి షాక్ ఇచ్చిన తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఎమ్మెల్యే సూచించిన పేరు ఎంపీ సూచించిన పేరు కాకుండా మధ్యే మార్గంగా పదో వార్డు కౌన్సిలర్ మండవ కృష్ణ కుమారి పేరు మీద బీఫామ్ అధిష్టానం పంపడంతో ఎమ్మెల్యే సీరియస్‌ అయ్యారు. కౌన్సిలర్లను తీసుకొని నేరుగా ఎన్నిక జరిగే జగజ్జీవన్ రామ్ భవనంకు చేరుకున్నారు. బీఫామ్ లేకుండా 14వ వార్డు కౌన్సిలర్ సత్యవతితో నామినేషన్ వేసేందుకు సిద్ధం అయ్యారు. ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య సూచించిన 14వ వార్డు కౌన్సిలర్ సత్యవతికి కౌన్సిలర్లు మద్దతు ఇచ్చే అవకాశం ఉందని బీఫామ్ లేదు కాబట్టి ఇండిపెండెంట్‌గా సత్యవతి చైర్మన్ అయ్యే అవకాశం ఉందనే చర్చ సాగుతోంది.

Share this post

scroll to top