తన ఇంట్లో వైఎస్సార్‌తో పాటు కేసీఆర్ ఫోటోలు కూడా ఉన్నాయని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నచ్చిన నాయకుల ఫొటోలను ఇంట్లో పెట్టుకుంటే తప్పేంటని ప్రశ్నించారు. ఈ రోజు అసెంబ్లీ లాబీలో మీడియాతో ఆయన చిట్ చాట్ చేశారు. ఎవరి అభిమానం వాళ్లది అని ఫొటోలు పెట్టుకోవడం తప్పేం లేదని కామెంట్ చేశారు. తాను కాంప్రమైజ్ కాలేదని కాను కూడా అంటూ క్లారిటీ ఇచ్చారు. అధికారుల విషయంలో వెనక్కి తగ్గేది లేదని మరోసారి స్పష్టం చేశారు నాగేందర్. YSR సీఎంగా ఉన్న సమయంలో సైతం అధికారుల విషయంలో తాను కాంప్రమైస్ కాలేదన్నారు. జైలుకు పోవడానికి కూడా సిద్ధమన్నారు. తనపై 173 కేసులు ఉన్నాయన్నారు. పేదల ఇళ్లు కుల్చుతా అంటే ఊరుకోనని హైడ్రా విషయంలో వెనక్కి తగ్గనన్నారు.
కేసీఆర్ ను పొగుడుతూ సంచలన కామెంట్స్..
