నేడు మహాకుంభమేళాకు ప్రధాని నరేంద్ర మోడీ..

modi-05.jpg

ఉత్తరప్రదేశ్‌ లోని ప్రయోగరాజ్‌ లో జరుగుతున్న మహాకుంభమేళా కోలాహలంగా కొనసాగుతోంది. ఈ కుంభమేళాకు దేశ విదేశాల నుంచి భక్తులు భారీగా తరలి వస్తున్నారు. ఈ క్రమంలో త్రివేణి సంగమంలో తలస్నానం చేసి పాపాలు పోగొట్టుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి వృద్ధులు, మహిళలు, సాధువులు, సన్యాసులు వస్తున్నారు. ఈ విధంగా త్రివేణి సంగమంలో పవిత్ర స్నానాలు ఆచరిస్తూ ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. సామాన్య భక్తులతో పాటు అనేక మంది ప్రముఖులు కూడా కుంభమేళాకు హాజరై పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. ఈ క్రమంలో నేడు భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మహాకుంభమేళాకు రానున్నారు. ఈ రోజు ఉదయం పత్యేక విమానంలో ప్రయాగ్‌రాజ్ చేరుకోనున్న పీఎం నరేంద్ర మోడీ అక్కడి త్రివేణి సంగమంలో ఆయన పుణ్యస్నానం ఆచరిస్తారు. అనంతరం గంగాదేవికి ప్రార్థనలు చేయనున్నారు. ఈ మేరకు ప్రధాన మంత్రి కార్యాలయం తెలిపింది. ప్రధాని మోడీ పర్యటన నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ మంగళవారం రాత్రే ప్రయాగ్ రాజ్ మహా కుంభమేళా ప్రాంతానికి చేరుకున్నారు.

Share this post

scroll to top