రామ్ చరణ్ సినిమా సెట్స్‌లో క్లీంకారా..

ram-charan-06.jpg

రామ్ చరణ్ తన ముద్దుల కూతురికి షూటింగ్ ఎలా జరుగుతుందో చూపించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటో సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతుంది. సానా బుచ్చిబాబు దర్శకత్వంలో రామ్ చరణ్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతుంది. ఈ క్రమంలో చెర్రీ తన కూతురును షూటింగ్ సెట్‌కు తీసుకెళ్లారు. దీనికి సంబంధించిన ఫొటోను చరణ్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ సెట్‌లో నా చిన్నారి అతిథి. RC16” అంటూ క్యాప్షన్ ఇచ్చారు.

ఇక ఈ ఫొటోలో క్లీంకారా ఏదో చూపిస్తూ తన డాడీ ను ఏదో అడిగినట్లు కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ ఫొటోస్ నెటిజన్స్‌ను తెగ ఆకట్టుకుంటున్నాయి. ఇక ఈ ఫొటోలో కూడా రామ్ చరణ్ తన కూతురి ఫేస్ కనిపించకుండా కవర్ చేశారు. ఇందులో చెర్రీ నవ్వుతూ.. చాలా సంతోషంగా కనిపించారు. ఇక రామ్ చరణ్ RC16 మూవీ షూటింగ్ ప్రస్తుతం చిత్రీకరణ జూబ్లీహిల్స్ బూత్ బంగ్లాలో జరుగుతోంది. ఈ లొకేషన్ మెగా ఫ్యామిలీ ఇంటికి చాలా దగ్గరగా ఉండటంతో, చెర్రీ క్లీంకారాను సెట్స్ వద్దకు తీసుకెళ్లినట్లు తెలుస్తోంది.

Share this post

scroll to top