యూట్యూబర్, పాడ్‌కాస్టర్ రణవీర్ అల్లాబాడియా చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా ఆగ్రహాన్ని రేకెత్తిస్తున్నాయి. రోస్ట్ షోలో ఆయన చేసిన వ్యాఖ్యల్ని మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ సీరియస్‌గా తీసుకున్నట్లు తెలుస్తోంది. పరిమితులు దాటి ఎవరైనా అమర్యాదగా ప్రవర్తిస్తే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అల్లాబాడియాపై ఇద్దరు ముంబై న్యాయవాదులు ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ వివాదంపై మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ మాట్లాడుతూ దీని గురించి నాకు సమాచారం అందింది, అయితే నేను ఇంకా చూడలేదు. ఇది చాలా అసభ్యకరంగా ఉందని మరియు ఇది తప్పు అని నాకు తెలిసింది. ప్రతి ఒక్కరికీ వాక్ స్వేచ్ఛ ఉంటుంది కానీ మనం ఇతరుల స్వేచ్ఛను ఆక్రమించినప్పుడు ఈ స్వేచ్ఛ ముగుస్తుంది. ప్రతి ఒక్కరికీ పరిమితులు ఉంటాయి, ఎవరైనా వాటిని దాటితే, చర్య తీసుకోబడుతుంది’’ అని అన్నారు.
యూట్యూబర్ రణవీర్ అల్లబాడియా వ్యాఖ్యలపై ఫడ్నవీస్ ఆగ్రహం..
