నేడు విడదల రజిని బెయిల్‌ పిటిషన్‌పై విచారణ..

rajani-11.jpg

2019లో సోషల్ మీడియా లో పోస్టులు పెట్టి ప్రశ్నించినందుకు గాను తనను చిత్రహింసలు గురి చేశారని ఐటీడీపీ అధ్యక్షుడు పిల్లి కోటి, మాజీ మంత్రి విడదల రజిని పై ఆరోపణలు గుప్పించారు. ఆమెపై కేసు నమోదు చేయాలని గతంలో ఎన్ని సార్లు పోలీస్ ‌స్టేషన్ కు వెళ్లగా ఎలాంటి స్పందన లేకపోవడంతోనే బాధితుడు కోటి చివరికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ను ఆశ్రయించారు.

ఈ మేరకు ఆయన పిటిషన్‌‌పై ఈనెల 5న విచారణ చేపట్టిన ధర్మాసనం రెండు వారాల్లోగా కేసు నమోదు చేసి వివరాలు ఇవ్వాలని పల్నాడు జిల్లా ఎస్పీ కి ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఆదేశాలు నేపథ్యంలో మాజీ మంత్రి విడదల రజిని పై చిలకలూరిపేట పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ క్రమంలోనే తనపై నమోదైన కేసుల ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని విడదల రజిని హైకోర్టు ను ఆశ్రయించారు. ఈ మేరకు ఇవాళ ధర్మాసనం ఆమె పిటిషన్‌పై విచారణ చేపట్టనుంది. మరోవైపు ఈ కేసులో తమ అభిమాన నాయకురాలికి కోర్టు ముందస్తు బెయిల్ ఇస్తుందా లేదో అన్న టెన్షన్ చిలకలూరిపేట వైసీపీ శ్రేణుల్లో నెలకొంది.

Share this post

scroll to top