వరద సాయంలో కూట‌మి సర్కార్‌ విఫలం..

botcha-11.jpg

వరద సహాయంలో కూటమి సర్కార్‌ విఫలమైందని విపక్షనేత బొత్స సత్యనారాయణ, ఎమ్మెల్సీలు  మొండితోక అరుణ్ కుమార్, రుహుల్లా మండిపడ్డారు. బుడమేరు వరద సాయంపై జరిగిన చర్చలో వారు మాట్లాడుతూ వైయ‌స్ జగన్‌ ప్రకటించిన కోటి రూపాయలను మేమే బాధితులకు అందించామని తెలిపారు. చంద్రబాబు ప్రభుత్వంపై తమకు నమ్మకం లేదని అందుకే మేమే స్వయంగా మా పార్టీ తరపున బాధితులకు సాయం అందించామని బొత్స తెలిపారు.

ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్ మాట్లాడుతూ.. వరద బాధితుల్లో అనేక మందికి ఇంకా పరిహారం అందలేదని మండిపడ్డారు. వరద సహాయం విషయంలో ప్రభుత్వం విఫలమైంది. ఆపరేషన్ బుడమేరు అన్నారు. ఇప్పటివరకు ఏం చేశారో ప్రభుత్వం సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్‌ చేశారు. మ‌రో ఎమ్మెల్సీ రుహుల్లా మాట్లాడుతూ బుడమేరు గేట్లను ఇంతవరకు ఎలాంటి అభివృద్ధి చేయలేదని వరదల తర్వాత బుడమేరును ప్రభుత్వం ఎందుకు పట్టించుకోలేదని దుయ్యబట్టారు. ఇప్పటికీ అనేకమంది బాధితులు కలెక్టరేట్ చుట్టూ తిరుగుతున్నారు. ఒక ఇంటికి పరిహారం ఇచ్చి 10 ఇళ్లకు ఇచ్చినట్లు రాసుకున్నారు. అందరికీ సాయం అందిందని చెప్పడం పచ్చి అబద్ధమని రుహుల్లా ఆగ్రహం వ్యక్తం చేశారు.

Share this post

scroll to top