ఆడవారు ఈ లక్షణాలను నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలకే ముప్పు..

hart-11.jpg

మారుతున్న జీవన శైలి, ఆహారపు అలవాట్ల కారణంగా ఇటీవల కాలంలో గుండెపోటు బారిన పడే వారి సంఖ్య పెరిగిపోతుంది. వయసుతో సంబంధం లేకుండా చిన్నా, పెద్దా ఎవరో ఒకరు గుండెపోటుతో కుప్పకూలుతున్న ఘటనలు నిత్యం చూస్తున్నాం. ఇక చాలా మంది ఆడవారికి గుండె సమస్యలు తక్కువగా వస్తాయనే అపోహలో ఉంటారు. కానీ, మెనోపాజ్ తర్వాత ఈ సమస్య ఆడవారిలోనూ విపరీతంగా పెరుగుతుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలో శరీరంలో వచ్చే పలు మార్పులు, లక్షణాలతో గుండెపోటు ప్రమాదాన్ని ముందే గుర్తించవచ్చని సూచిస్తున్నారు.

ఆడవారికి గుండె సమస్యలు వచ్చేటప్పుడు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, అలసట, ఎక్కువగా చెమట, ఉబ్బరం వంటి లక్షణాలు ఉంటాయి. ఇక ఊబకాయం, హైబీపి, కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండడం వల్లే సాధారణంగా గుండె సమస్యలు వస్తాయి. అలాగే, ఆడవారిలో ఒత్తిడి, డిప్రెషన్ కూడా గుండెపై ఎఫెక్ట్ చూపిస్తుంది. షుగర్ ఉన్న ఆడవారిలో సైలెంట్ హార్ట్ ప్రాబ్లమ్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. అదే కాకుండా ప్రెగ్నెన్సీ టైమ్‌లో హైబీపి, షుగర్ వంటి సమస్యలు కూడా ప్రమాదాన్ని పెంచుతాయి.

ఈ సమస్యలు తగ్గించుకునేందుకు మంచి పోషకాహారం తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. పండ్లు, కూరగాయలు, లో ఫ్యాట్ డెయిరీ ప్రోడక్ట్స్, లీన్ ప్రోటీన్స్ తీసుకోవాలి. ఉప్పు, చక్కెర, అన్‌హెల్దీ ఫ్యాట్స్‌ని తగ్గించాలి. ఒత్తిడిని తగ్గించుకోవాలి. బీపి, బ్లడ్ షుగర్, కొలెస్ట్రాల్‌ లెవల్స్‌ని సరిగా మెంటెయిన్ చేస్తే గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.

Share this post

scroll to top