టాలీవుడ్‌పై కాన్సట్రేషన్ చేస్తోన్న ప్లాప్ బ్యూటీ..

heroin-19.jpg

బహుబాషా నటుడు, టాలీవుడ్ ప్రముఖ విలన్ మహేశ్ మంజ్రేకర్ నటనను వారసత్వంగా తీసుకుని ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది ఆయన తనయ సాయీ మంజ్రేకర్. సల్మాన్ ఖాన్ దబాంగ్ 3తో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన ఈ ముంబయి ముద్దుగుమ్మ డాడీ సూచనలతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. వరుణ్ తేజ్ ఘనిలో తెలుగు స్క్రీన్ పైకి తెరంగేట్రం చేసింది స్టార్ కిడ్. కానీ అమ్మడికి లక్ కలిసి రాలేదు. సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడింది.

మహేశ్ బాబు నిర్మాతగా వ్యహరించిన ‘మేజర్’ చిత్రంలో అడివిశేష్ సరసన నటించింది సాయీ మంజ్రేకర్. ఈ సినిమా హిట్టుగా నిలిచినప్పటికీ శేష్ ఖాతాలో క్రెడిట్ వెళ్లిపోయింది. ఆ తర్వాత రామ్ సరసన స్కందలో నటించింది భామ. కానీ ఈ సినిమా కూడా ప్లాప్ టాక్ తెచ్చుకుంది. తెలుగులో చేసిన మూడింటిలో రెండు ప్లాప్స్ రావడంతో హిందీ పరిశ్రమకు చెక్కేసింది సాయీ. కానీ టాలీవుడ్ పై మనసు చంపుకోలేదు. పడిన చోటే పేరు తెచ్చుకోవాలని టాలీవుడ్‌పై మరింత కాన్సట్రేషన్ పెడుతుంది సాయీ మంజ్రేకర్. తెలుగులో మంచి ఆఫర్లను కొల్లగొడుతుంది. ప్రజెంట్ టీటౌన్‌లో రెండు సినిమాలకు కమిటయ్యింది అమ్మడు. కళ్యాణ్ రామ్, విజయ శాంతి తల్లీకొడుకులుగా నటిస్తోన్న అర్జున్ సన్నాఫ్ వైజయంతిలో హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే నిఖిల్ సరసన ‘ద ఇండియా హౌజ్‌’లో యాక్ట్ చేస్తోంది.

Share this post

scroll to top