ఇంత గబ్బు ఏందయ్యా సుబ్బయ్య..

subhaya-22.jpg

సుబ్బయ్య గారి హోటల్‌లో భోజనం అంటే మామూలుగా ఉండదు. ఆ హోటల్‌లో ఫుల్ మీల్స్ ఒక్కటే కాదు హోటల్‌ కూడా ఫేమస్. రెండు తెలుగు రాష్ట్రాల్లో లెక్కలేనన్ని బ్రాంచ్‌లు ఉన్నాయి. తింటే సుబ్బయ్య భోజనమే తినాలి. అనేంతలా ఈ హోటల్ పాపులర్ అయింది. ముఖ్యంగా కాకినాడలో సుబ్బయ్య హోటల్‌కి చాలా క్రేజ్. అది ఇప్పుడు హైదరాబాద్ వరకూ విస్తరిచింది. తెలుగు రాష్ట్రాల్లో నోరూరించే ఫుడ్ ఏదన్నా ఉంది అంటే అది సుబ్బయ్య గారి భోజనమే అని చెప్తారు. కాకినాడలో ప్రారంభమైన ఈ హోటల్. ఇప్పుడు వైజాగ్, విజయవాడ, సూర్యాపేట, హైదరాబాద్, బెంగళూరు వంటి ప్రాంతాల్లో విస్తరించింది.

ఈ హోటల్‌లో వెజ్ మీల్స్‌కి భోజన ప్రియులు పడిచచ్చిపోతారు. అంతటి టేస్ట్ ఉంటుంది మరి. నోరూరించే రుచి, ఆకలి తీర్చే క్వాంటిటి వల్ల ఈ హోటల్ బాగా ఫేమస్ అయింది. ఈ హోటల్‌లో ఒక్కసారి భోజనం చేశారంటే మళ్లీ మళ్లీ అక్కడకే వెళ్లాలి అనేంతలా ఉంటుంది. ఆహా ఇదేం భోజనం రా బాబు ఎంత తిన్నా తినాలనే అనిపిస్తుంది అని అంటారు. అలాంటి హోటల్ ఇప్పుడు దారుణంగా తయారైనట్లు అధికారుల తనిఖీలో బయటపడింది. హైదరాబాద్‌లోని కొండాపూర్‌లో కాకినాడ సుబ్బయ్య హోటల్‌లో టాస్క్ ఫోర్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఆ తనిఖీల్లో సంచలన విజువల్స్ బయటపడ్డాయి. 

Share this post

scroll to top