ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై మరోసారి వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, యాంకర్ శ్యామల సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు పరిపాలన చేసే సత్తా లేదని ఒక పెద్ద మనిషి చెప్తున్నారని అన్నారంటూ సెటైర్లు వేశారు. రాజమండ్రి కిమ్స్ లో చికిత్స పొందుతున్న బాధితురాలి పరిస్థితిని సీఎం చంద్రబాబు, హోంమంత్రి అనిత దృష్టికి తీసుకు వెళ్ళచ్చు కదా అని ప్రశ్నించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కనీసం ఆ పని కూడా చేయలేదని విమర్శించారు. రాజమండ్రిలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడి కిమ్స్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న మెడికల్ విద్యార్థిని అంజలిని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా ప్రతినిధి బృందం పరామర్శించింది. వైసీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు ఎమ్మెల్సీ వరుడు కళ్యాణి, వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, యాంకర్ శ్యామల. హాస్పిటల్ కి విచ్చేసి అంజలి ఆరోగ్య పరిస్థితిని డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. బాధితురాలు కుటుంబ సభ్యులను అడిగి వివరాలు తెలుసుకున్నారు.
పవన్ కల్యాణ్‌పై మరోసారి శ్యామల సంచలన వ్యాఖ్యలు..
