తాము అధికారంలోకి వచ్చిన తర్వాత కంచగచ్చిబౌలి భూములను వెనక్కి తీసుకుంటామని అక్కడ ఒక్క ఇంచు స్థలం కొనుగోలు చేసినా నష్టపోతారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఆ 400 ఎకరాల భూమిని గ్రీన్ జోన్ గా ప్రకటించి హైద్రాబాద్ లోనే బెస్ట్ ఎకో పార్క్ తయారు చేసి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి కానుగా ఇస్తాం. ఇది మా పెద్దలు కేసీఆర్ తీసుకున్న నిర్ణయం అని వెల్లడించారు. ఇవాళ తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడిన కేటీఆర్ ఈ భూముల విషయం రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తగ్గకపోతే ఉద్యమం తప్పదని హెచ్చరించారు. ఈ భూములు హైదరాబాద్ ప్రజలకు చెందినవని ఇది హైదరాబాద్ భవిష్యత్ కోసం చేస్తున్న పోరాటం అన్నారు.
కంచ గచ్చిబౌలి భూములు ఎవరూ కొనవద్దు..
