ఏపీ రాజధాని కి కేంద్రం న్యూస్ ప్రకటించింది. అమరావతి అభివృద్ధికి రూ. 4,200 కోట్లు విడుదల చేసింది. దీంతో అమరావతి అభివృద్ధి పనులు మరింత ఊపందుకోనున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అమరావతి అభిృద్ధిపై దృష్టి సారించిన విషయం తెలిసిందే. అయితే ఇందుకు కావాల్సిన నిధులు విడుదల చేయాలని కేంద్రప్రభుత్వాన్ని సీఎం చంద్రబాబు నాయుడు కోరుతున్నారు. ఢిల్లీ వెళ్లి మరీ కేంద్రమంత్రులను కలిసి నిధుల విడుదలు చేయాలని అభ్యర్థిస్తున్నారు.
అటు కేంద్రప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందిస్తోంది. ఇప్పటికే పలు కార్యక్రమానికి ఆర్థిక సాయం అందించింది. పోలవరం, విశాఖ స్టీల్ ప్లాంట్ లాంటి పెద్ద ప్రాజెక్టులకు సైతం చేయూతనిచ్చింది. వేల కోట్ల నిధులను ఇప్పటికే అందించింది. అమరావతి అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని ఇప్పటికే పలుమార్లు రాష్ట్ర ఎంపీలు స్పష్టం చేశారు. ఇందులో భాగంగా నిధులు విడుదల చేస్తున్నట్లు తెలిపారు. కూటమి ప్రభుత్వంలో రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కృషి వల్లే రాష్ట్రానికి అధిక నిధులు అందుతున్నాయని తెలిపారు.