వైఎస్ జగన్ పర్యటనపై పరిటాల సునీత సంచలన వ్యాఖ్యలు..

sunitha-07.jpg

వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ రాప్తాడు పర్యటనపై స్పందించిన ఎమ్మెల్యే పరిటాల సునీత. సంచలన వ్యాఖ్యలు చేశారు. మరోసారి తోపుదుర్తి సోదరులపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆమె జగన్మోహన్ రెడ్డికి దమ్ముంటే రాప్తాడు వైసీపీ టికెట్ బీసీలకు ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. తోపుదుర్తి బ్రదర్స్ చెప్పిన తప్పుడు మాటలు నమ్మి రాప్తాడులో ఫ్యాక్షన్ రాజకీయాలు చేయొద్దు.. అని సూచించారు. ఇద్దరి మధ్య జరిగిన గొడవను తోపుదుర్తి బ్రదర్స్ రాజకీయం చేస్తున్నారు. లింగమయ్య మరణంపై మొదటిగా బాధపడిన వ్యక్తిని నేనే దాడి చేసిన వ్యక్తుల్ని వెంటనే అరెస్టు చేసి రిమాండ్ కూడా తరలించారు. బీసీల పార్టీ ఏదైనా ఉందంటే అది ఒక తెలుగుదేశం పార్టీ మాత్రమే. జగన్ మోహన్ రెడ్డి లింగమయ్య కుటుంబానికి ఏదైనా సాయం అందించు అంతేగాని తోపుదుర్తి బ్రదర్స్ చెప్పిన మాట విని బీసీ కులాల్లో చిచ్చు పెట్టకు ఇప్పటికైనా చనిపోయిన లింగమయ్య కుటుంబానికి సాయం చేయడానికి నేను ముందుంటాను అని స్పష్టం చేశారు.

Share this post

scroll to top