కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఏపీపై మోదీ సర్కార్ వరాల జల్లు కురిపిస్తోంది. ఓ వైపు పోలవరం మరోవైపు రాజధాని అమరావతి నిర్మాణాలను ముందుకు తీసుకెళ్తుంది. ఇంకొవైపు రాష్ట్ర విభజన సమయం నుంచి పెండింగ్‌లో ఉన్న అంశాల పరిష్కారం దిశగా అడుగులెస్తోంది. ఈ క్రమంలోనే ఏపీకి మరో గుడ్‌న్యూస్ చెప్పింది కేంద్రం ప్రభుత్వం. విభజన చట్టంలో ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు కేంద్రం కసరత్తు మొదలు పెట్టింది. రాష్ట్ర విభజన వేళ నుంచి పరిష్కారం కాని సమస్యలపై దృష్టి సారించింది. ఇందులో భాగంగానే అమరావతి నుంచి హైదరాబాద్‌కు గ్రీన్ ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవేకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందుకోసం డీపీఆర్ సిద్ధం చేయాలని హోంశాఖను ఆదేశించింది. మొత్తం 6 లైన్లలో దాదాపు 25 వేల కోట్ల రూపాయల వ్యయంతో ఈ ప్రాజెక్ట్ చేపడుతున్నట్లు తెలుస్తోంది.
ఏపీకి గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం..
