ఏపీ నుంచి రాజ్యసభకు మంద కృష్ణ మాదిగ..

madha-krishna-26.jpg

ఖాళీ అయిన రాజ్యసభ సీటు ఎవరికి  దక్కుతుందన్న  విషయంపై పెద్ద చర్చే నడుస్తోంది.  బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి   అమిత్‌ షాతో, ఏపీ సీఎం చంద్రబాబు  నిన్న ఢిల్లీ  పర్యటనలో  ఈ విషయమై చర్చించినట్టు తెలుస్తోంది. ఈ సందర్భంగా  ఆ  సీటును తమకు ఇవ్వాలని బీజేపీ కోరినట్టు సమాచారం. ఆ స్థానం నుంచి తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు సింగం మాజీ ఐపీఎస్ అన్నామలై కు ఇవ్వాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇలా వుండగా నిన్న ఆసక్తికర  పరిణామం చోటు చేసుకుంది. MRPS అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ అటు అమిత్‌ షాతో, ఇటు చంద్రబాబుతో సమావేశం కావడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.

రెండు  తెలుగు రాష్ట్రాల్లో SC వర్గీకరణ చట్టం అమలు అయిన నేపథ్యంలో మంద కృష్ణ మాదిగకు ఆ స్థానం దక్కనుందన్న ప్రచారం జోరుగా సాగుతోంది.  ఇప్పుడు జరగబోయే రాజ్యసభ స్థానం ఎన్నికకు BJP నుంచి తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు  అన్నామలై, మంద కృష్ణమాదిగ పేర్లు పరిశీలనలో వున్నట్టు ఉహాగానాలు ఊపందుకున్నాయి. రీసెంట్ గా మందకృష్ణ మాదిగను కేంద్రం గణతంత్య్ర దినోత్సవం సందర్భంగా పద్మ శ్రీ అవార్డుతో గౌరవించిన సంగతి తెలిసిందే కదా. ఈ నేపథ్యంలో ఏపీలో ఖాళీ అయిన రాజ్యసభ సీటు ఈయనకే దక్కే అవకాశం ఎక్కువగా ఉంది.

Share this post

scroll to top