పాకిస్తానీయులకు నేడే చివరి రోజు..

pak-29.jpg

కాశ్మీర్‌లోని పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్-పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటికే భారత్ లో నివసిస్తున్న పాకిస్తానీయుల వీసాలను రద్దు చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. నిర్దేశిత‌ గడువులోపు దాయాది దేశ పౌరులు భారత్ విడిచి వెళ్లాలని తెలిపింది. పాకిస్తాన్ దేశస్థులు భారత్ ను వీడేందుకు ఈ రోజు చివరి రోజు మెడికల్ వీసాలపై వచ్చిన వారికి కూడా ఇవాళ డెడ్ లైన్ దేశం విడిచి వెళ్ళిపోవాలని, లేకపోతే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో వివిధ రాష్ట్రాల్లో ఉంటున్న పాక్ పౌరులు తమ దేశానికి వెళ్లిపోతున్నారు.

కేంద్ర ప్రభుత్వం ఆదేశాలతో తెలంగాణ పోలీసులు సైతం అలర్ట్ అయ్యారు. హైదరాబాద్ నగర పోలీసు కమిషనరేట్ పరిధిలోని స్పెషల్ బ్రాంచ్‌‌లో నమోదైన పాకిస్తాన్ పౌరుల వివరాలను పరిశీలించారు. ఈ క్రమంలోనే డీజీపీ జితేందర్ కేంద్ర హోంశాఖ ఆదేశాల మేరకు రాష్ట్రంలో ఉంటున్న పాకిస్తానీలను పంపించేందుకు తగిన ఏర్పాట్లు చేశారు. హైదరాబాద్ లో ఉన్న పాక్ పౌరులు తమ దేశానికి వెళ్లిపోవాలి. లేకపోతే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. కాగా, ఇప్పటికే నలుగురు పాకిస్తానీలు హైదరాబాద్ వదిలి పెట్టి వెళ్లిపోగా వారిలో ఒక పురుషుడు, ఒక మహిళ ఆమె కూతురు, మరో మహిళ ఉన్నారు.

Share this post

scroll to top