ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లా గుత్తి వద్ద నిజామాబాద్-తిరుపతి రాయలసీమ ఎక్స్‌ప్రెస్‌లో చోరీ జరిగింది. ఆగి ఉన్న రైలులోకి చొరబడిన దొంగలు ప్రయాణికులకు చెందిన బంగారం, నగదుతోపాటు విలువైన వస్తువులను ఎత్తుకెళ్లారు. సోమవారం అర్ధరాత్రి 1.30 గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకున్నది. అమరావతి ఎక్స్‌ప్రెస్‌కు లైన్‌క్లియర్ చేసేందుకు గుత్తి శివారులో రాయలసీమ ఎక్స్‌ప్రెస్‌ను నిలిపారు. ఈ సమయంలోనే దుండగులు ఆ రైలులోని 10 బోగీల్లో దోపిడీకి పాల్పడ్డారు. దీంతో 20 మంది బాధిత ప్రయాణికులు తిరుపతి రైల్వే పోలీసులను ఆశ్రయించారు.
రాయలసీమ ఎక్స్‌ప్రెస్‌లో దొంగల హల్‌చల్..
