ఏపీ మెగా డీఎస్సీ అభ్యర్థులకు అలర్ట్. ఏపీ మెగా డీఎస్సీ అభ్యర్థులకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఇటీవల విడుదలైన డీఎస్సీ నోటిఫికేషన్‌లో అభ్యర్థులకు ఇబ్బందికరంగా మారిన పలు నిబంధనలను సవరిస్తూ నిర్ణయం తీసుకుంది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం. ఈ మేరకు ఎక్స్ ద్వారా ట్వీట్ చేసారు మంత్రి నారా లోకేశ్. సర్టిఫికెట్లు అప్‌లోడ్ చేయడం తప్పనిసరి కాదని ట్వీట్ ద్వారా వెల్లదించారు. అయితే, వెరిఫికేషన్ సమయంలో మాత్రం ఒరిజినల్ సర్టిఫికెట్లు చూపించాలని సూచనలు చేశారు మంత్రి నారా లోకేశ్.
ఏపీ మెగా డీఎస్సీ అభ్యర్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్..
