కొంతమంది నాయకులు ఇక్కడ కూర్చొని పాకిస్తాన్ ను ప్రేమిస్తామని చెబుతున్నారని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. మీకంత ప్రేమ ఉంటే పాకిస్తాన్ వెళ్లిపోండని హితవు పలికారు. మంగళగిరి ఎస్కన్వెన్షన్లో పహల్గాం అమరులకు నివాళి కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ మాట్లాడారు. ఉగ్రదాడి మృతులకు నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇలా చెబుతున్నవారంతా కాంగ్రెస్నాయకులన్నారు. వీరిలో కొంతమంది ఎమ్మెల్సీలు కూడా ఉన్నారని తెలిపారు. దక్షిణాదిలో కూడా కొంతమంది ఇదే విధంగా మాట్లాడుతున్నారని తెలిపారు. కాంగ్రెస్‌లోనే విబేధాలున్నాయని అన్నారు.
భారత్దేశంపై దాడి జరిగినపుడు ఇటువైపు నిలబడాలి తప్ప పాకిస్తాన్ వైపున నిలబడతామని చెప్పడం ఏంటన్నారు. ఇదేం సెక్యులరిజం అని ప్రశ్నించారు. దీనిని ఎవరూ ఒప్పుకోరని అన్నారు. ప్రాణాలు పోతే తిరిగి వస్తాయా అన్నారు. కశ్మీర్‌లోని పహల్గాంలో ఉగ్ర మూకలు మతం అడగి మరీక్ష ఊచకోత కోశారని ఆవేదన వ్యక్తం చేశారు. సరిహద్దుల్లో భద్రత అత్యంత ముఖ్యం అన్నారు. మతపరంగా దాడి జరిగితే చెప్పడానికి భయం ఎందుకని ప్రశ్నించారు. చనిపోయిన 26 మందిలో 25 మంది హిందువులు అని, ఒకరు మాత్రమే ముస్తిం అని తెలిపారు. ఐడీ కార్డులు అడిగి హిందువా, ముస్లింవా అని తెలుసుకుని కాల్పులు జరిపారన్నారు. ఎంతో నమ్మకంతో కాశ్మీర్ పర్యటను వెళ్లారని తెలిపారు.