మరావతి పునః ప్రారంభ సభలో చంద్రబాబు, లోకేష్ అసత్యాలు చెప్పారు..

ambati-03.jpg

అమరావతి పునః ప్రారంభ సభలో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ అసత్యాలు చెప్పారని మాజీ మంత్రి అంబటి రాంబాబు పేర్కొన్నారు. అమరావతి ఒక అంతులేని కథ అమరావతి నిర్మించడంలో చంద్రబాబు అట్టర్ ప్లాప్ అయ్యారు అని మండిపడ్డారు. అమరావతి కోసం గత చంద్రబాబు ప్రభుత్వంలో 41 వేల కోట్లకు పైగా టెండర్లు పిలిచి 5500 కోట్లు ఖర్చు చేశారు. గత ఐదు సంవత్సరాల చంద్రబాబు పాలనలో అమరావతి భ్రమరావతి అయింది. అందుకే చంద్రబాబును చిత్తుచిత్తుగా ఓడించారు అని ఆయన తెలిపారు. 10 సంవత్సరాలు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా విభజన చట్టంలో అవకాశం కల్పించారు. చంద్రబాబును అక్కడ తంతే ఇక్కడికి వచ్చి పడ్డాడు. లక్ష కోట్లతో అద్భుతమైన నగరాన్ని నిర్మించడానికి మన రాష్ట్రలో ఆర్థిక వనరులు ఉన్నాయా అని ప్రశ్నించారు. చంద్రబాబు అమరావతి పేరుతో అందరిని ముంచేశారని అంబటి రాంబాబు అన్నారు.

భూములు ఇచ్చిన రైతులకు చంద్రబాబు అభివృద్ధి చేసిన ప్లాట్లు కూడా ఇవ్వలేకపోయారు అని మాజీమంత్రి అంబటి రాంబాబు తెలిపారు. అమరావతి విధ్వంసం చేసిన వ్యక్తి చంద్రబాబు. మేము అన్ని వాస్తవాలు చెబుతున్నాం జగన్ అమరావతిని అభివృద్ధి చేద్దామంటే కోర్టులకు వెళ్లి అడ్డుకున్నారు. చంద్రబాబు అమరావతి సెల్ఫ్ సస్టైనబుల్ నగరం అని చెప్తున్నారు. సెల్ఫ్ సస్టైనబుల్ నగరానికి 52 వేల కోట్లు ఎందుకు అప్పు చేశారు. జగన్ అప్పు చేస్తే రాష్ట్రం శ్రీలంక అయిపోతుందని తప్పుడు ప్రచారం చేశారు. గత చంద్రబాబు ప్రభుత్వంలో అమరావతిలో శాసనసభకు రూ. 2271 కోట్లు టెండర్ పిలిస్తే ఇప్పుడు దాన్ని అంచనాలు పెంచారు. ఇప్పుడు శాసనసభ నిర్మాణానికి రూ. 4689 కోట్లు అంచనాలు పెంచి టెండర్ల పెంచుతున్నారు. అమరావతి పేరుతో అప్పులు తెచ్చి చంద్రబాబు దోచుకుంటున్నాడు. ఒక కిలోమీటర్ రోడ్డు నిర్మాణానికి 50 కోట్లు ఖర్చు చేస్తున్నారు. వర్షం పడితే అమరావతి పరిస్థితి ఏంటో అందరికీ తెలుసు అని అంబటి రాంబాబు చెప్పుకొచ్చారు.

Share this post

scroll to top