పెద్ది స్టైల్‌లో సిక్స్ కొట్టిన ఢిల్లీ క్యాపిటల్స్‌ యంగ్ ప్లేయర్.. 

charan-05.jpg

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఇప్పుడు పెద్ది సినిమాతో పేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఉప్పెన సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న దర్శకుడు బుచ్చిబాబు సన దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన టైటిల్ టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఇక ఈ సినిమాలో చరణ్ మాస్ లుక్ లో కనిపించనున్నాడు.

పెద్ది టైటిల్ టీజర్ లో రామ్ చరణ్ క్రికెట్ ఆడే సీన్ చూపించారు. చరణ్‌ సిగ్నేచర్‌ షాట్‌ బాగా వైరల్‌ అయింది. అయితే ఇప్పుడు ఇదే క్రికెట్ షాట్ రీ క్రియేట్ చేశారు ఢిల్లీ క్యాపిటల్స్. ప్రస్తుతం ఐపీఎల్ సీజన్ నడుస్తుండటంతో ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా మ్యాచ్ లను వీక్షిస్తున్నారు. ఢిల్లీ క్యాపిటల్స్‌ యంగ్ ప్లేయర్ పెద్ది సినిమా క్రికెట్ సీన్ ను రీ క్రియేట్ చేసిన వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Share this post

scroll to top